కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతికి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హుస్నాబాద్

తెలంగాణ ఉద్యమ తొలితరం పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు చేనేత కార్మికుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి కొనియాడారు. బాపూజీ చూపిన పోరాట బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆయన పిలుపునిచ్చారు.