ఫార్ములా ఈ కేసు విచారణకు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

కక్షసాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన ఫార్ములా-ఈ అక్రమ కేసు విచారణకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. రాజకీయ కక్ష సాధింపులకోసమే ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.