యూకేలో రాజకీయ సమీకరణాలు మారాయి చారిత్రక ఒప్పందం కుదిరింది
రిపోర్టర్: శివ
స్థలం: World
యూకేలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌ల జాతీయవాద పార్టీల నేతలు ఒక్కతాటిపైకి వచ్చి స్వయం నిర్ణయాధికారం కోరుతూ చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునే హక్కు వెస్ట్‌మినిస్టర్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం దీనికి రాజ్యాంగపరమైన మార్పులతో సిద్ధం కావాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ పరిణామం యూకే రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.