అసెంబ్లీ ఘటనపై ఢిల్లీకి బిఆర్‌ఎస్ మహిళా నేతలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

తెలంగాణ శాసనసభ వద్ద నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని బిఆర్‌ఎస్ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మహిళా ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా నెట్టివేసిన పోలీసుల దురహంకారంపై జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు పలువురు నేతలు ఢిల్లీకి చేరుకుని మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌లకు ఫిర్యాదు చేయనున్నారు.