'వైకాపా హయాంలో 4,100 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు': పంచుమర్తి అనురాధ ధ్వజం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో రూ.150 కోట్ల స్కాం జరిగిందని, గ్రూప్‌-1 ప్రశ్నపత్రాలను ప్రైవేట్‌ రిసార్ట్‌కు తరలించి అనర్హుల చేత మూల్యాంకనం చేయించారని తెదేపా చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ అమరావతిలో మండిపడ్డారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో డీఎస్సీ ద్వారా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. మంత్రి లోకేశ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలని వైకాపా నాయకులు డీఎస్సీపై నిందలు వేస్తున్నారని, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు.