పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా శివప్రసాద్
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం రాజకీయ పోటీ కాదని, యువత భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. చినుకని శివ ప్రసాద్ అన్నారు.
నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఉన్నత విద్య, యువతకు మెరుగైన అవకాశాలు వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వచ్చే నాయకత్వం అవసరమన్నారు. పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపిస్తూ, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
“పట్టభద్రుల ఓటు ఒక వ్యక్తి గెలుపు కోసం కాదు.. మన యువత భవిష్యత్తు కోసం. ఈ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు ఆలోచించి ఓటు వేయాలి” అని డా. శివ ప్రసాద్ అన్నారు.