హైదరాబాద్‌లో రవాణా విప్లవం: మెట్రో మరియు ఆర్టీసీకి ఒకే పాస్
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
హైదరాబాద్ ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో, బస్సులకు వర్తించేలా వన్డే నుంచి వన్‌మంత్ ఇంటిగ్రేటెడ్ పాస్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కాలుష్య నివారణలో భాగంగా నగరానికి మరిన్ని ఈ-బస్సులు, డీజిల్ ఆటోలకు బదులు బ్యాటరీ ఆటోల కొనుగోలుకు డ్రైవర్లకు రూ.200 కోట్ల సాయం అందించనున్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.