అంకితా భండారి మృతి కేసు: తల్లిదండ్రుల ఆవేదనపై మల్లు భట్టి విక్రమార్క ఆందోళన

రిపోర్టర్: శివ స్థలం: ఖమ్మం

కేవలం పంతొమ్మిదేళ్ల వయసులో కూతురుని కోల్పోయిన తల్లిదండ్రుల క్షోభ వర్ణనాతీతమని, నాలుగేళ్లుగా వారు నిజం కోసం పోరాడుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధకు తగిన స్పందన లభించాలని, అంకితా భండారి మరణంపై వారు లేవనెత్తుతున్న ప్రతి ప్రశ్నకు కూడా సరైన సమాధానాలు దక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అంకితా భండారి కుటుంబానికి రాహుల్ గాంధీ అండగా నిలవడాన్ని భండి విక్రమార్క సమర్ధించారు.