ధ్వని కాలుష్యంపై అల్లు శిరీష్ పోస్ట్తో సోషల్ మీడియాలో వివాదం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని షేక్పేట్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళల్లో భారీ శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయడంపై టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పండుగల సమయంలో ధ్వని కాలుష్యంపై ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవారాన్ని కొందరు నెటిజన్లు హీరో అల్లు అర్జున్తో ముడిపెట్టి విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలైంది. అయితే పౌర బాధ్యతను దృష్టిలో పెట్టుకోవాలని శిరీష్ స్పష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.