యాదాద్రి జిల్లాలో కెమికల్ పరిశ్రమల మూసివేతకు డిమాండ్ చేస్తూ సీపీఎం మహాధర్నా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాలుష్యకారక కెమికల్ పరిశ్రమలను వెంటనే మూసివేయాలని సీపీఎం నేత ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాలలో వ్యర్థాల కారణంగా ప్రజలు క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వరకు పదకొండు కిలోమీటర్ల మే పాదయాత్ర నిర్వహించి మహాధర్నా చేపట్టారు. బాధితులకు ఎకరానికి యాభై రెండు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని నాయకులు కోరారు.