రాయలసీమ అభివృద్ధికి సరికొత్త బాట: లక్ష కోట్లతో మెగా హార్టికల్చర్ హబ్

రిపోర్టర్: అశోక్ స్థలం: మదనపల్లె

రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తూ మదనపల్లె కేంద్రంగా లక్ష కోట్ల ప్రతిపాదిత వ్యయంతో నిర్మించతలపెట్టిన రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంయుక్తంగా శంకుస్థాపన చేయనున్నారు అని అధికారులు వెల్లడించారు. కరువు మండలంగా పేరుపొందిన ఈ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద ఉద్యానవన క్షేత్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మహత్తర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.