సహరాన్ పుర్ లో మాజీ ప్రజాప్రతినిధులతో నితిన్ నబిన్ భేటీ
రిపోర్టర్: గోపి
స్థలం: సహరాన్ పుర్
ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పుర్ లో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పశ్చిమ క్షేత్ర మాజీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు, కేంద్రరాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరితో పాటు పలువురు పార్టీ ప్రముఖులు, సీనియర్ నాయకులు పాల్గొని రాబోయే రాజకీయ పరిణామాలు, వ్యూహాలపై చర్చలు జరిపారు.