అజిత్ కుమార్ రేసింగ్ ప్రయాణంపై గ్లాడియేటర్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: చెన్నై

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మోటార్ స్పోర్ట్స్ పై ఉన్న మమకారాన్ని తెలియజేస్తూ రూపొందించిన గ్లాడియేటర్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ తాజాగా విడులైంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజిత్ తో పాటు ఆయన భార్య షాలిని, పిల్లలు అనుష్క, ఆద్విక్ మరియు రేసింగ్ టీమ్ సభ్యులు పాల్గొని ఆయన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఈ ట్రైలర్ అజిత్ రేసింగ్ పట్ల అంకితభావాన్ని, కుటుంబ సభ్యుల అనుభవాలను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది.