రాజకీయాల కోసం రక్తసంబంధాలను పణంగా పెట్టవద్దని రాంబాబు హెచ్చరించారు

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి జిల్లా చింతపల్లిలో ఏఆర్పీసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కె.రాంబాబు రాజకీయ ఎన్నికలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఐదు సంవత్సరాల పరిపాలన కోసం కుటుంబ బంధాలను, సోదరభావాలను దెబ్బతీసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల కోసం శత్రుత్వాలు పెంచుకోవడం మూర్ఖత్వమని, ఎవరికీ దూరంగా ఉండవద్దని ఆయన స్పష్టం చేశారు.