గోశాల సందర్శనలో వెల్లడైన ప్రకృతి వ్యవసాయ విశేషాలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చల్లూరు గ్రామంలో ధ్యాన్ ఫౌండేషన్ గోశాలను ఆత్మ కమిటీ చైర్మన్ ఎనగండ్ల సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి తదితర బృందం మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు పూనం కపుర్ తో చర్చించి, రైతులకు వర్మి కంపోస్ట్ తయారీకి అవసరమైన గేదెల పెడను సేకరించి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.