ఫారమ్ ఆరు మార్పులపై ఎన్నికల సంఘాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
ఓటర్ నమోదుకు సంబంధించిన ఆన్లైన్ ఫారమ్ ఆరు నిబంధనలను అక్రమంగా మార్చారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా నిలదీశారు. స్వయంగా ఎన్నికల సంఘం కమిషనర్లే ఈ విషయాన్ని రికార్డు చేశారని ఆయన గుర్తుచేశారు. ఈ మార్పులు చేయాలని ఎన్నికల సంఘంలో ఎవరు ఆదేశాలు జారీ చేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రతినిధులు ఎవరి ఒత్తిళ్లతో సంతకాలు చేశారంటూ ఆయన నిలదీయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.