సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ జాబ్ మేళా

రిపోర్టర్: కిరణ్ స్థలం: Kodad, Suryapet

సూర్యాపేట జిల్లా కోదాడలో 2026 సెప్టెంబర్ 19వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. స్థానిక సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యానిలయంలో ఉదయం 8 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుమారు 300కు పైగా కంపెనీలు పాల్గొంటున్న ఈ జాబ్ మేళా ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.