పాలకొండలో వైఎస్సార్సీపీకి గట్టి షాకిస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ పట్టణంలో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వారాడ శ్రీనివాసరావు మరియు వారాడ ధనలక్ష్మి భారతీయ జనతా పార్టీలో చేరారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఉమా మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు వారికి పార్టీ కండువాలు కప్పారు. పలువురు కూటమి నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.