స్వర్గీయ జిఎంసి బాలయోగి 75వ జయంతి: నివాళులర్పించిన అమలాపురం ఎంపీ హరీష్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కోనసీమ

మాజీ లోక్సభ స్పీకర్ స్వర్గీయ జిఎంసి బాలయోగి 75వ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించినట్లు అమలాపురం ఎంపీ మరియు టీడీపీ విప్ గంటి హరీష్ మాధుర్ తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి సేవలను, రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజా జీవితంలో ఆయన ఆదర్శవంతమైన విలువలను పాటించారని, ప్రజల కోసం ఎంతో సేవ చేశారని ఈ వేడుకల వేళ ఆయన కొనియాడారు.