మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కులో చిరుతల అరుదైన స్నేహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ప్రాజెక్ట్ చీతాలో భాగంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. భారతదేశంలో జన్మించిన కేఎన్జీ23 మరియు బోత్సువానా నుంచి రప్పించిన సీసీబీ4 అనే రెండు మగ చిరుతలు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ ఒకదానితో ఒకటి అద్భుతమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయి. ఏమాత్రం రక్త సంబంధం లేని ఈ రెండు చీతా లు కలిసి తిరుగుతూ, వేటాడటం, ఆహారాన్ని పంచుకోవడం మరియు ఒకదానికొకటి తోడుగా నిలవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.