సికింద్రాబాద్ స్టేషన్ లో భారీ నకిలీ నోట్ల రవాణా గుట్టురట్టు: అరెస్ట్

రిపోర్టర్: శివ స్థలం: సికింద్రాబాద్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ.60 లక్షల విలువైన నకిలీ నోట్లను తరలిస్తున్న శివరతన్ మహియాను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అక్టోబర్ 31న అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జైపూర్ నుంచి ముంబైకి ఈ అక్రమ రవాణా జరుగుతుండగా, ఆకస్మిక తనిఖీల్ లో భాగంగా నిందితుడి వద్ద ఉన్న 12 కట్టల నకిలీ కరెన్సీని, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఓం ప్రకాశ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.