రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ప్రభుత్వ పాఠశాలల ఎస్ఎంసీ ఎన్నికలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు తొంబై శాతానికి పైగా చోట్ల ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. మొత్తం నలభై నాలుగు వేలకు పైగా పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో మిగతా చోట్ల వాయిదా పడినట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలలో తెదేపా, వైకాపా వర్గీల మధ్య తలెత్తిన విభేదాలు, ఘర్షణల కారణంగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కోరం లేకపోవడం మరియు పరిపాలన కారణాలతో కొన్ని బడుల్లో ఎన్నికలను అక్టోబరు ఒకటో తేదీకి అధికారులు వాయిదా వేశారు.