ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ బాబ్ మాకీ కన్నుమూత

రిపోర్టర్: నరేష్ స్థలం: World

అమెరికాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ బాబ్ మాకీ 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. చెర్, మైలీ సైరస్ వంటి ప్రముఖులకు అద్భుతమైన డిజైన్లు అందించి హాలీవుడ్‌లో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.