తోటపల్లిలో ఘనంగా ముగిసిన వినాయక చవితి ఉత్సవాలు

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో గత పదమూడు రోజులుగా శక్తి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మలు, కోలాటాలు వేశారు. సాంస్కృతిక పాటలకు అనుగుణంగా దాండియా ఆడుతూ గ్రామస్థులు సందడి చేశారు. దీంతో పల్లెలో పండుగ వాతావరణం నెలకొంది.