చిలకపాలెంలో మహాసేన అన్నదానం: మూడు వేల మంది భక్తులకు విందు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం టీమ్ మహాసేన నేతృత్వంలో సుమారు మూడు వేల మందికి భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమం స్థానికంగా విశేష స్పందనను రాబట్టింది. ఈ అన్నదాన వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు.