ఏటీఎం మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అల్లూరి పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: కిరణ్
స్థలం: అల్లూరి సీతారామరాజు
ఏటీఎం మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అల్లూరి పోలీసులు హెచ్చరించారు. ఏటీఎం కేంద్రాలలో కార్డులను ఉపయోగించే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుందని, బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని, పిన్ నంబర్లు మరియు ఓటీపీ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.