'పేదల జీవితాల్లో భరోసా నింపే ముందడుగు': మంత్రి వంగలపూడి అనిత

రిపోర్టర్: గోపి స్థలం: Andhra Pradesh

ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేదల జీవితాల్లో భరోసా నింపేందుకు మరో అడుగు ముందుకు వేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా ప్రక్రియను పారదర్శకంగా కొనసాగిస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ-కేవైసీ నుంచి ధృవీకరణ వరకు ప్రతి అంశాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.