రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల విజేతల జాబితా విడుదల
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 175 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ప్రభుత్వం ఎంపిక చేసింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. శనివారం విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వీరికి అవార్డులను ప్రదానం చేయనున్నారు.