ఉద్యోగాల పేరుతో ఐదు కోట్ల మోసం: స్వయంగా కిడ్నాప్ నాటకమాడిన నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Lucknow
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి, బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో స్వయంగా కిడ్నాప్ నాటకమాడిన సత్యరత్న దీక్షిత్ అనే వ్యక్తిని గుజరాత్ లోని అహ్మదాబాద్లో అరెస్ట్ చేసినట్లు లక్నో పోలీసులు తెలిపారు. నిందితుడు నిరుద్యోగులకు నకిలీ నియామక పత్రాలు అందజేసి మోసానికి పాల్పడ్డాడని, పరారీలో ఉన్న అతడిని ప్రత్యేక బృందాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయని ఎస్ హెచ్ ఓ శివానంద్ మిశ్రా వెల్లడించారు.