కాకా జయంతి వేడుకలు: బెల్లంపల్లిలో నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
దివంగత నేత గడ్డం వెంకటస్వామి 97వ జయంతిని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాకా సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను, పేదలకు అందించిన సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల యాదగిరి స్పష్టం చేశారు.