సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూముల సర్వేలో తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: మహేష్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల సర్వేలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎర్రవల్లి పరిధిలోని 325 సర్వే నంబర్‌లో ఉన్న 388 ఎకరాల భూమిని అధికారులు సర్వే చేస్తుండగా పొరుగు గ్రామైన వెంకటాపూర్ రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే చేస్తున్న భూముల్లో 180 ఎకరాలు తమ గ్రామానికి చెందినవేనని, సరిహద్దులను తప్పుగా చూపించారంటూ వారు అధికారులను నిలదీయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.