భక్తిపారవశ్యంతో పులకించిన శ్రీకాంత్ కాలనీ వినాయక మండపం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకాంత్ కాలనీలో శివపుత్ర గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్ దంపతులు, కాలనీవాసులు రఘుపతి రెడ్డి, స్వామి, దేవేందర్, వంశీ, శేఖర్, కృష్ణయ్య, రవి తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. విఘ్నేశ్వరుని కృపతో అందరి జీవితాలు ఆనందమயமாக ఉండాలని ఆకాంక్షించారు.