తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవం కనులపండువగా సాగింది. రథాన్ని లాగేందుకు వేల సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం హనుమంత వాహనంపై శ్రీకోదండ రాముని అలంకారంలో విహరించిన స్వామివారు, రాత్రికి గజ వాహనసేవలో మాడవీధుల్లో భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ వేడుకల్లో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్రతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.