ఉపాధ్యాయుల కేడర్ స్పష్టత: జిల్లా కేడర్గా ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

రాష్ట్రంలో ఉపాధ్యాయుల కేడర్, స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025కు అనుగుణంగా ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లను జిల్లా కేడర్గా ప్రకటిస్తూ వేర్వేరు జీవోలు వెలువడ్డాయి. దీనివల్ల దాదాపు లక్ష మంది ఎస్జీటీలు, ది వేల మంది స్కూల్ అసిస్టెంట్లు జిల్లా లోకల్ కేడర్ పరిధిలోకి వచ్చారని అధికారులు స్పష్టం చేశారు.