ఢిల్లీలో భారీ వర్షం: నీట మునిగిన ఇందిరా గాంధీ విమానాశ్రయం
రిపోర్టర్: అశోక్
స్థలం: ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వానలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణం పూర్తిగా నీట మునిగింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, తొమ్మిది విమానాలను ఇతర నగరాలకు మళ్లించారు. 400కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పరిస్థితి దృష్ట్యా వాతావరణ శాఖ ఢిల్లీకి 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని విమానయాన సంస్థలు సూచించాయి.