అట్టర్ ప్లాప్ సీఎం అంటూ రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత ధ్వజం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని, ఆయన అట్టర్ ప్లాప్ సీఎం అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విలేకరులతో జరిపిన చిట్ చాట్లో ఆమె మాట్లాడుతూ, రాబోయే ఎండాకాలంలో భైరవ పేరుతో ప్రత్యేక బస్సులో పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని కవిత స్పష్టం చేశారు.