ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ వ్యూహం: వామపక్షాల మద్దతు కోరిన రేవంత్ రెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్ లో విజయం సాధించడంతో పాటు ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సీపీఐ, తెలంగాణ జన సమితి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. వామపక్షాలు, ప్రజాసంఘాల మద్దతును కూడగట్టే దిశగా అధికార పార్టీ అడుగులు వేస్తోంది. ఈ కొత్త రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ కు ఎంతవరకు లాభిస్తాయనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.