హైదరాబాద్‌కు కొత్త బస్ టెర్మినల్స్: ట్రాఫిక్ కష్టాలకు చెక్!

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో ట్రాఫిక్, కాలుష్యం తగ్గించి, రవాణా మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ఉంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం, గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్‌లలో ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నారు. దూరప్రాంత బస్సులను నగరంలోకి అనుమతించకుండా టెర్మినల్స్ వద్దే నిలిపి, అక్కడి నుండి లాస్ట్ మైల్ కనెక్టివిటీతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నారు. ప్రైవేట్ బస్సుల పార్కింగ్ సమస్యకూ పరిష్కారం చూపుతారు.