కరువు ఛాయలతో అలమటిస్తున్న వజ్రపుకొత్తూరు రైతాంగం ఆక్రోశం

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ కింద 200 రోజులు పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావంతో 82 శాతం లోటు వర్షపాతం నమోదై ఎండిపోయిన పొలాలను నాయకులు పరిశీలించారు. రైతులను ఆదుకోవాలని, పంట నష్టపరిహారం అందించాలని ఈ నెల 21న ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.