వానదేవుని కరుణతో పులకించిన జన్నారం పల్లెసీమలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో వేసవి తాపం తగ్గి వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ అకస్మిక వర్షం వల్ల పత్తి, వరి, మక్కా తదితర పంటలకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమాచారం ప్రకారం ఈ వర్షం వ్యవసాయానికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు.