నెల్లూరులో చిరు వ్యాపారులపై పోలీసుల ప్రతాపం: అక్రమ వసూళ్లతో పీడిస్తున్న వైనం

రిపోర్టర్: శివ స్థలం: నెల్లూరు

నెల్లూరు కూరగాయల మార్కెట్లో చిరు వ్యాపారుల నుంచి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్, వన్టౌన్ పోలీసులు వంతులవారీగా రోజుకు మూడుపూటలా వసూళ్లు చేస్తూ, నగదు ఇవ్వకపోతే కూరగాయలను రోడ్డుపై పారబోస్తున్నారని మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత తెలిపారు. పేద వ్యాపారులను జలగల్లా పట్టి పీడిస్తున్న ఈ దౌర్జన్యాలపై అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.