విషాదం: ఎంఐఎం నేత సయ్యద్ ఐజాజ్ మృతి పట్ల ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
కార్వాన్ ప్రాంతానికి చెందిన ఎంఐఎం పార్టీ సాలార్జంగ్ కాలనీ ప్రైమరీ యూనిట్ అధ్యక్షుడు సయ్యద్ ఐజాజ్ మృతి పట్ల కౌసర్ మొహియుద్దీన్ - ఎమ్మెల్యే కార్వాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాష్ట సానుభూతి తెలిపారు. సయ్యద్ ఐజాజ్ ఎంతో నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.