స్ప్లిట్స్విల్లా ఫేమ్ ఆకాంక్ష చౌదరిపై ఈవెంట్ నిర్వాహకుల తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

స్ప్లిట్స్విల్లా పదహారో సీజన్ ఫేమ్ ఆకాంక్ష చౌదరి చేసిన ఆరోపణలను ఈవెంట్ నిర్వాహక బృందం తీవ్రంగా ఖండించింది. తమపై మోసం చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, రూ. ఏడు లక్షల ఒప్పందంలో ఇప్పటికే ఆరు లక్షలు చెల్లించామని, కేవలం లక్ష రూపాయల విషయంలోనే వివాదం తలెత్తిందని నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన నటి ఇలా తప్పుగా ప్రచారం చేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.