తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ కుట్రలంటూ కేఆర్ఎంబీకి ప్రభుత్వ ఫిర్యాదు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
తెలంగాణ చేపట్టిన పదిహేను ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరిందని అధికారులు తెలిపారు. అనుమతులు లేని ప్రాజెక్టులను అడ్డుకోవాలని, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిరోధించాలని ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ పదకొండు పేజీల లేఖ రాశారు. 66ః34 నిష్పత్తిలోనే జలాలను వినియోగించుకోవాలని, తెలంగాణ జల హక్కులను కాలరాసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.