యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు ఒక్కరోజే సమకూరిన రూ. 14 లక్షల ఆదాయం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం రూ.14,11,586 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ప్రధాన బుకింగ్, బ్రేక్, వీఐపీ దర్శనాలు, కార్ పార్కింగ్, ప్రసాదాల విక్రయాలు అలాగే లీజుల విభాగాల ద్వారా ఈ మొత్తం భక్తుల నుంచి సమకూరినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు.