గురుకుల విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్న సెల్ఫ్ డిఫెన్స్ తరగతులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాడేరు

పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో గురుకుల మహిళా కళాశాల విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండో బ్యాచ్కు చెందిన 120 మంది విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ప్రారంభమైంది. ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ ఆదేశాల మేరకు పాండు కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈ శిక్షణ అందిస్తున్నారు. అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండు రాజు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి ప్రారంభించారు. ఇటీవల శిక్షణను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పూజా విద్యార్థినుల ఆత్మరక్షణ ప్రదర్శనను అభినందించారు. ఈ శిక్షణతో విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు.