ఉద్యోగ అవకాశాల కోసం ఎన్సీఎస్ పోర్టల్‌ను ఉపయోగించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు మరియు కెరీర్ కౌన్సెలింగ్ సేవల కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సూచించింది. ఒకే డిజిటల్ వేదికపై ఉద్యోగ సమాచారం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. అర్హులైన అభ్యర్థులు ncs.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి తమ వివరాలు నమోదు చేసుకుని ఉపాధి అవకాశాలను పొందవచ్చని అధికారులు వెల్లడించారు.