బోధన్ అభివృద్ధిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం: అర్వింద్ ధర్మపురి తీవ్ర ఆరోపణలు

రిపోర్టర్: సునీల్ స్థలం: నిజామాబాద్

బోధన్ ప్రాంత అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. బోధన్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసినా కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. తన హయాంలో ప్రజల కోసం నిరంతరం పోరాడి తొమ్మిది ఆర్ఓబీలను సాధించుకున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేసే విషయంలో తమకు ఎప్పుడూ స్పష్టమైన నిబద్ధత ఉంటుందని అర్వింద్ ధర్మపురి స్పష్టం చేశారు.