నిమ్స్ వైద్యుడు లక్ష్మీభాస్కర్ ఇళ్లపై ఏసీబీ దాడులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, నాలుగు కార్లు, పలు ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లు, స్థలాలు లభించడం వైద్య వర్గాల్లో సంచలనం సృష్టించింది. నిమ్స్ లో ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా ఒక వైద్యుడిపై ఏసీబీ దాడులు జరగడం మరియు ఆయన గదిలో కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.