స్వదేశ్ దర్శన్ 2.0 పథకం: అరసవల్లి ఆలయ అభివృద్ధికి భారీ నిధులు

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రానున్న రెండేళ్లలో యాభై ఐదు కోట్లకు పైగా నిధులతో సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ మరియు ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులతో కలిసి ఆయన ఈ కీలక ప్రాజెక్టు వివరాలను అధికారికంగా ప్రకటించి హర్షం వ్యక్తం చేశారు.